గోల్డెన్ న్యూస్ / మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడెం గ్రామంలో బతుకమ్మ సంబరాల్లో విషాదం చోటుచేసుకుంది..బతుకమ్మ ఆడుతూ శెట్టి మౌనిక (32) గుండెపోటుతో మృతి
వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం ఉదయం నుంచే మౌనిక తన ఇద్దరు కూతుర్లు, కొడుకుతో కలిసి పూలను తెంపుకొని బతుకమ్మను సిద్దం చేసింది. సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక దేవాలయంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొంది. పాటలు పాడుతూ, కోలాటాలు వేస్తూ బతుకమ్మ చుట్టూ తిరుగుతున్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయింది.
అనంతరం వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గం మధ్యలోనే మృతి చెందింది. పండగ వాతావరణంలో అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Post Views: 38









