గోల్డెన్ న్యూస్ /ఆదిలాబాద్ : జిల్లా కేంద్రంలోని సుందరయ్యనగర్‌కు చెందిన ఓ యువకుడు ధని లోన్ యాప్‌లో రూ. 5 లక్షల రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. లోన్ మంజూరు కావాలంటే ముందుగా నగదు చెల్లించాలని మెసేజ్ రావడంతో, బాధితుడు విడతల వారీగా రూ. 1,00,650 చెల్లించాడు. లోన్ రాకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.
Post Views: 40









