ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఇద్దరు మృతిచెందారు.
మృతులను మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ రాజు, కడారి సత్యానారాయణ రెడ్డి అలియాస్ కోసాగా గుర్తించారు. ఘటనా స్థలిలో ఏకే 47, ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌ను బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ధ్రువీకరించారు. ఒక్కొక్కరి తలపై రూ.40లక్షల చొప్పున రివార్డు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు

Post Views: 33









