Rain alert : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం తీవ్రతరం చేస్తుంది. ఇప్పటికే పలుచోట్ల కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని దెబ్బతీయగా, రాబోయే రోజుల్లో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్ పరిస్థితి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ప్రకటన ప్రకారం, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, ఏలూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని సూచించింది. రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంతాల్లో గాలుల వేగం పెరిగే అవకాశం ఉండటంతో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు._
తెలంగాణలో వర్షాల తీవ్రత
తెలంగాణలో ఇప్పటికే వర్షాలు దంచికొడుతుండగా, రానున్న రెండు రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది._ _ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది._
_సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నారాయణపేట, వికారాబాద్ వంటి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గంటకు 30-40 కి.మీ.ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని హెచ్చరించారు._









