ఆంధ్రప్రదేశ్ లొ స్వల్ప భూకంపం.

 భయంతో పరుగులు తీసిన జనం

ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా మరోసారి భూ ప్రకంపనలతో ఉలిక్కిపడింది.. ఒంగోలులో అర్ధరాత్రి సమయంలో స్వల్పంగా భూమి కంపించింది. రాత్రి 2 గంటల సమయంలో 2 సెకన్ల పాటు భూమి కంపించింది. ఒంగోలులోని సీఎస్ఆర్ శర్మ కాలేజీ  కాలేజీ ప్రాంతంలో రాత్రి 2 గంటల ప్రాంతంలో భూమి అత్యధికంగా కనిపించినట్లు స్థానికులు చెబుతున్నారు.. అయితే, రాత్రి సమయం కావటంతో స్థానికులు గుర్తించేలోపే భూ ప్రకంపనల తీవ్రత తగ్గినట్టుగా తెలుస్తోంది.. దీనిపై సమాచారం అందుకున్న అధికారులు.. స్థానిక ప్రజల నుంచి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు..

Facebook
WhatsApp
Twitter
Telegram