పాము కాటుతో మహిళ మృతి

గోల్డెన్ న్యూస్ / ములుగు : నూగురు వెంకటాపురం మండలం తిప్పాపురం గ్రామపంచాయతీ పరిధిలోని కలిపాక గ్రామానికి చెందిన మోడెం లక్ష్మి( 55) అనే మహిళ నిద్రిస్తుండగా బుధవారం వేకువ జామున తుపాకి కట్లపాము కాటు వేసింది ఏదో కాటు వేసిందని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో ఆమెను వెంటనే వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ ఆస్పటల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ ఈమె పాము కాటుకు గురైనదని అప్పటికే ఆమె మరణించినట్లు వారు తెలిపారు. ఈ విషాద ఘటనలో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram