గోల్డెన్ న్యూస్/ మణుగూరు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు శుక్రవారం నాడు నిర్వహించి ఓ ఎస్ ఐ పై కేసు నమోదు చేశారు. ఓ వ్యక్తికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు 40 వేలు నగదు డిమాండ్ చేసిన క్రమంలో ఎస్సై బత్తిని రంజిత్ ఏసీబీ వలకు శుక్రవారం చిక్కాడు. ఐదు నెలల వ్యవధిలో మణుగూరు ఠాణాలో అవినీతి నిరోధక శాఖ(అనిశా) కేసులు రెండు నమోదవటం గమనార్హం పోలీసు అధికారులే లంచావతారులుగా మారటంతో మణుగూరు ఠాణా ప్రతిష్ఠ మసకబారుతోంది. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో ఎస్ఐ రంజిత్ సుమారు 40 వేల రూపాయలు డిమాండ్ చేసినట్లు నిర్ధారణ కావడంతో, అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ విషయంపై ఏసీబీ అధికారులు లోతుగా విచారిస్తున్నారు.
Post Views: 44









