వర్షాకాలం.. కష్టకాలం.. రహదారులు లేక ఆదివాసుల బతుకులు దుర్భరం

బాహ్య ప్రపంచానికి దూరంగా ఏజెన్సీలోని ఆదివాసీ గూడేలు

 చావు, పుట్టుక, బతుకుకు బండెడు కష్టాలు.

 అవస్థలు తీర్చాలని అడవిబిడ్డల  వేడుకోలు

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం : వర్షాకాలం.. కష్టకాలం.. వంతెనలు, రహదారులు లేక ఆదివాసుల బతుకులు దుర్భరం ఏజెన్సీలోని ఆదివాసీ గూడేలు, పల్లెల్లో నివాసం ఉంటున్న ఆదివాసీ గిరిజనులు వంతెనలు, రహదారులు లేక దుర్భర జీవనం సాగిస్తున్నా

ఏజెన్సీలోని ఆదివాసీ గూడేలు, పల్లెల్లో నివాసం ఉంటున్న ఆదివాసీ గిరిజనులు వంతెనలు, రహదారులు లేక దుర్భర జీవనం సాగిస్తున్నారు.  గ్రామాలకు రవాణా సౌకర్యం లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే అంతులేని కష్టాలను అనుభవిస్తున్నారు. భారీ వర్షాలతో వాగులు ఉప్పొంగడంతో మండల, పట్టణాలకు నిత్యావసరాలకు, వ్యవసాయ పనులకు వెళ్లాలంటే కష్టమవుతున్నది. ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రాపిడ్‌ ఫీవర్‌ సర్వేలు, వైద్య శిబిరాలు నిర్వహిస్తూ వైద్య సిబ్బంది గ్రామానికి వెళ్లి ప్రజలకు వైద్యసేవలతోపాటు అవసరమైన వారికి మందులు పంపిణీ చేస్తుంటారు. ఇటువంటి సందర్భాలలో కూడా అవస్థలు పడుతున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మం డలం ఆదివాసీ గ్రామమైన అశ్వాపురంపా డుకు చెందిన వృద్ధుడు మడకం మాసయ్య కొన్నేళ్లుగా టీబీతో బాధపడుతూ.. శుక్ర వారం రాత్రి ఆరోగ్యం క్షీణించి అస్వస్థతకు గురయ్యాడు. మాసయ్యను  ఆస్పత్రికి తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడింది అంబులెన్స్ వచ్చేం దుకు రహదారి సక్రమంగా లేకపోవడంతో.  కుటుంబ సభ్యులు గ్రామస్తులు మంచంలో. కిలోమీటర్ మేర అటవీ మార్గంలో ప్రధాన రహదారి  తీసుకొ చ్చారు. అప్పటికే 108 అంబులెన్స్ సిద్ధంగా ఉండడంతో మణుగూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram