ఆర్టీసీ బస్సు ఎక్కండి బహుమతులు పొందండి 

గోల్డెన్ న్యూస్ / మణుగూరు : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 27వ తారీకు నుండి అక్టోబర్ 6 వ తారీకు వరకు డీలక్స్, సూపర్ లగ్జరీ ,లహరి ,ఏసి రాజధాని బస్సులలో ప్రయాణించండి 50 వేల విలువైన బహుమతులను గెలుచుకోండి మీరు చేయవలసిందల్లా మీరు ప్రయాణం చేసిన టిక్కెట్ వెనకాల మీ పేరు ఫోన్ నెంబర్ను రాసి లక్కీ డ్రా బాక్స్ లో టికెట్ వేసినట్లయితే డ్రా తీసి విలువైన బహుమతులను అందిస్తాం మొదటి బహుమతిగా 25 వేల రూపాయలు రెండో బహుమతిగా 15000 రూపాయలు మూడో బహుమతిగా 10,000 రూపాయలను అందించడం జరుగుతుంది. అని మణుగూరు డిపో మేనేజర్ గారు కె. శ్యాంసుందర్ గారు ఒక ప్రకటనలో తెలిపినారు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం ఈ దసరా పండుగ సందర్భంలో ఈ సదవకాశాన్ని మణుగూరు పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోగలరని తెలియజేసినారు.

Facebook
WhatsApp
Twitter
Telegram