ఏసీబీకి చిక్కిన టౌన్ ప్లానింగ్ అధికారి

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్‌ : మేడ్చల్‌ జిల్లా ఎల్లంపేట మున్సిపల్‌ కార్యాలయంలో టౌన్‌ ప్లానింగ్‌ అధికారి రాధాకృష్ణారెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. వెంచర్‌కు అనుమతి కోసం రూ.5 లక్షలు లంచం డిమాండ్‌ చేశారు. ఇప్పటికే రూ.లక్ష అడ్వాన్సుగా తీసుకున్న రాధాకృష్ణ.. శనివారం మరో రూ.3.5 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. దీంతో ఆయనను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు.. రాధాకష్ణారెడ్డి ఇల్లు, కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram