బీసీ రిజర్వేషన్ల పెంపుపై చట్ట ప్రకారమే ప్రభుత్వం ముందుకెళ్లాలని ఆదేశించిన హైకోర్టు
గోల్డెన్ న్యూస్/ వెబ్ డెస్క్ : బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో విషయంలో సర్కారుకు బిగ్ షాక్ తగిలింది. బీసీ రిజర్వేషన్ జీవో రద్దు చేయాలంటూ దాఖలైన హౌస్‌మోషన్ పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతించడంతో సర్వత్రా టెన్షన్ నెలకొంది. జస్టిస్ అభినందన్ కుమార్ శావిలి, జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది. బీసీ రిజర్వేషన్లపై మాధవరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోను సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు.
విచారణ జరిపిన హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్‌లో ఉన్నపుడు జీవో ఇవ్వడం సరికాదని న్యాయస్థానం అభిప్రాయపడింది. అవసరమైతే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలని సూచించింది. కోర్టులు జోక్యం చేసుకోకూడదు అంటే 10 రోజులు ఎన్నికలు వాయిదా వేసుకోవాలని కోర్టు ఆదేశించింది. ప్రభుత్వం అభిప్రాయం తెలియజేసేందుకు కొంత టైం ఇచ్చింది.









