దళపతి విజయ్ ర్యాలీలో దుర్ఘటన.. తొక్కిసలాటలో 29 మంది మృతి

ప్రముఖ తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్‌.. తమిళనాడులోని కరూర్ లో నిర్వహించిన ర్యాలీ, బహిరంగ సభలో తొక్కిసలాట జరిగింది. విజయ్ ఫ్యాన్స్ వేలాదిగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఇప్పటి వరకు 29 మంది మృతి చెందగా మరో 50 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో 10 మంది మహిళలు, ఆరుగురు చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు. 22 మందిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం

Facebook
WhatsApp
Twitter
Telegram