గోల్డెన్ న్యూస్ / తెలంగాణ : నారాయణపేట జిల్లా మక్తల్ మండలం అనుగొండ గ్రామంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఇంటిపక్కన ఉన్న పాడుబడిన మట్టి మిద్దెలో ఆడుకుంటున్న ఆదిత్య (10)పై పడింది. దీంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు మక్తల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Post Views: 28









