స్పీడ్ పోస్ట్లో టారిఫ్ మార్పులు, కొత్త ఫీచర్లను పోస్టల్ శాఖ ప్రకటించింది.
అత్యంత విశ్వసనీయ డెలివరీ సేవగా మరింత బలోపేతం చేయడానికి, భద్రతను, విశ్వసనీయతను పెంచే లక్ష్యంతో కొత్త ఫీచర్లతో ఈ సేవలను నవీకరించారు.
సవరించిన టారిఫ్ అక్టోబర్ 1నుంచి అమలులోకి వస్తుంది. ఇకపై ఒక్కో స్పీడ్ పోస్టుపై రూ. 5 లతోపాటు జీఎస్టీ రుసుముగా వసూలు చేస్తారు.
వన్ టైమ్ పాస్ వర్డ్ డెలివరీ విలువ ఆధారిత సేవలకూ ఇదే రుసుము వర్తిస్తుంది.
అలాగే విద్యార్థులకు స్పీడ్ పోస్టు సేవలు మరింత అందుబాటులోకి తీసుకువచ్చేందుకు టారిఫ్ పై 10శాతాన్ని తగ్గించారు.
Post Views: 33









