గోల్డెన్ న్యూస్ / మహబూబాబాద్ : భర్త చేతిలో భార్య దారుణ హత్యకు గురైన ఘటన నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భర్త చీకటి నరేష్ కు భార్య స్వప్న(35) కు తరచూ గొడవలు జరుగుతుండడంతో క్షణికావేశంలో భర్త నరేష్ గొడ్డలితో స్వప్న మెడ భాగన వేటు వేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు విక్రమ్ (14)పండు (10) లు ఉన్నారు.
Post Views: 90









