ప్రేమ పెళ్లి చేసుకున్నారు ఆరు రోజులకే యువతి ఆత్మహత్య

గోల్డెన్ న్యూస్/ ఇబ్రహీంపట్నం :  ప్రేమ పెళ్లి చేసుకున్న ఆరు రోజులకే యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో విషాదం నింపింది.

 

పోలీసుల కథనం ప్రకారం గ్రామ శివారులోని ఒడ్డెర కాలనీకి చెందిన అల్లెపు గంగోత్రి(22), అదే కాలనీకి చెందిన సంతోష్ ప్రేమించుకున్నారు.

 

పెద్దల సమక్షంలో సెప్టెంబరు 26న పెళ్లి చేసుకున్నారు.

 

దసరా పండగ సందర్భంగా ఈ నెల 2న గంగోత్రి భర్తతో కలిసి పుట్టినింటికి వచ్చింది. ఆ రోజు రాత్రి భోజనం చేస్తున్న సమయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.

 

అనంతరం సంతోష్ భార్యతో కలిసి తన ఇంటికి వెళ్లారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత గంగోత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

 

కాగా భర్తతో జరిగిన గొడవతో మనస్తాపానికి గురవడం, అత్తింట్లో ఏదైనా జరగడం వల్ల తన కూతురు బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని మృతురాలి తల్లి శారద పోలీసులకు ఫిర్యాదు చేశారు….

Facebook
WhatsApp
Twitter
Telegram