2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తాం
– మావోయిస్టులతో మాట్లాడ్డానికి ఏమీ లేదు – ఆయుధాలు వదిలేసి లొంగిపోతామంటే స్వాగతిస్తాం – లొంగిపోయిన వారందరికీ పునరావసం కల్పిస్తాం
ఆయుధాలు వదిలేసి చర్చలకు వచ్చే విషయంలో మావోయిస్టుల్లో భిన్నాభిప్రాయాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులతో ఇక ప్రభుత్వం ఎటువంటి చర్చలు జరపదని.. ఆయుధాలు వీడి ముందుకు వస్తే స్వాగతిస్తామన్నారు. ఆ విధంగా లొంగిపోయిన వారందరికీ ప్రభుత్వం నుంచి అందాల్సిన వివిధ ప్రయోజనాలు అందిస్తామని.. పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. బస్తర్ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన హోంమంత్రి 2026 మార్చి 3. నాటికి దేశం మావోయిస్టు రహితంగా మారుతుందని పునరుద్ఘాటించారు.
Post Views: 40









