విపిఎల్-5 కప్ విజేత వీరే

– కింగ్స్ పై ఒక పరుగు తేడాతో గెలుపు

-ఉత్కంఠగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో సివిల్ ,మణుగూరు జట్టు కైవసం 

గోల్డెన్ న్యూస్ / తాడ్వాయి : దసర పండుగా సందర్భంగా తాడ్వాయి మండలంలోని రంగాపురం స్కూల్ మైదానంలో కరకగూడెం,పినపాక,మణుగూరు,ఆళ్ళపల్లి,గుండాల,తాడ్వాయి ఏడు స్థాయి విపిఎల్-5 ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్ సోమవారం ఉత్కంఠగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో సివిల్ టీం ఒక పరుగుతో గెలుపొందింది.

విజేతలకు చెన్నూరు శేషుబాబు,కొపెల్ల కిరణ్ ప్రసాద్,కొమరం వెంకటనారయణ గార్ల చేతుల మీదగా సివిల్ జట్టుకు 20,116/-,కొత్తూరు కింగ్స్ జట్టు 10,116/- నగదు తోపాటు బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లడుతూ…గ్రామీణ ప్రాంతంలో అణిముత్యం లాంటి క్రీడాకారులు ఉంటారని,ఐపీఎల్ తరహాలో పట్టణాల్లో జరిగే ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్‌ గ్రామీణ ప్రాంతంలో నిర్వహించి,క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడం అభినందనీయం అని పేర్కొన్నారు.విజేతలకు బహుమతులు కార్యక్రమానికి ఆహ్వానించిన మేనేజ్మెంట్ వారిని వారు అభినందించారు.అనంతరం అథితులను ఘనంగా టోర్నీ నిర్వహకులు సత్కారించారు.

ఈ కార్యక్రమంలో ఇర్ప సూర్యం,జివ్వాజి మోహన్ రావు,గుమ్మడి ముత్తయ్య,సీనియర్ ఫ్లేయర్ భానుప్రసాద్,టోర్నీ నిర్వహకులు రంజిత్,ప్రసాద్,గోపి,సుధాకర్,శివ తదితరులు పాల్గోన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram