కల్తీ మద్యం నిందితులకు వత్తాసు పలకడం గురించి మీరు మాట్లాడకండి : మంత్రి లోకేశ్‌

క‌ల్తీ మ‌ద్యం గురించి, నిందితుల‌కు వ‌త్తాసు ప‌ల‌క‌డం గురించి మాట్లాడే అర్హ‌త జగన్ మోహన్ రెడ్డి కి లేదు.- మంత్రి నారా లోకేష్

 

క‌ల్తీ మ‌ద్యం ప‌ట్టుకున్న‌ది మా ప్ర‌భుత్వం.

క‌ల్తీ మ‌ద్యం నిందితుల్లో టీడీపీ నేత‌లున్నా అరెస్ట్ చేయించింది మా ప్ర‌భుత్వం. నిందితుల్లో ఇద్ద‌రు మా పార్టీ వారుంటే త‌క్ష‌ణ‌మే వారిని తెలుగుదేశం పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు మా అధ్యక్షుడు. మీ ఐదేళ్ల పాల‌న‌లో ఏం చేశారో మ‌రిచిపోయి ఆరోప‌ణ‌లు చేయొద్దు.

 

మీ జ‌మానాలో జంగారెడ్డి గూడెంలో క‌ల్తీ మ‌ద్యం తాగి ప్ర‌జ‌లు చ‌నిపోతే, స‌హ‌జ‌మ‌ర‌ణాల‌ని నిందితుల‌ను కాపాడే ప్ర‌య‌త్నం చేశారు. `పోతే పోయారు… ఇంకా ఏడుస్తారేంటి?` అని మీ మంత్రి జోగి ర‌మేష్ గారు అహంకారం ఇప్ప‌టికీ ప్ర‌జ‌లు గుర్తుంచుకున్నారు.

 

ద‌ళితుడైన డ్రైవ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యంని చంపి డెడ్ బాడీ డోర్ డెలివ‌రీ చేసిన మీ వైసీపీ ఎమ్మెల్సీ అనంత‌బాబుని అప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ పార్టీ నుంచి క‌నీసం స‌స్పెండ్ చేయ‌లేదు, స‌రిక‌దా ఇంటికి పిలిపించుకుని భోజ‌నం పెట్టి స‌న్మానించారు. క‌ల్తీ మ‌ద్యం గురించి, నిందితుల‌కు వ‌త్తాసు ప‌ల‌క‌డం గురించి మాట్లాడే అర్హ‌త మీకు ఎక్క‌డుంది జ‌గ‌న్ గారూ!

#madanapalletv

Facebook
WhatsApp
Twitter
Telegram