మ్యాన్ ఆఫ్ ది సీరిస్ అవార్డు కైవసం చేసుకున్న అతిక్ ఖాన్

 దసరా క్రికెట్ టోర్నీలో అద్భుత ప్రదర్శన.

గోల్డెన్ న్యూస్ / పినపాక : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని గోపాలరావుపేట గ్రామంలో దసరా పండుగ సందర్భంగా నిర్వహించిన రెండు జిల్లాల స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌లో పద్మాపురం గ్రామానికి చెందిన యువకుడు పటాన్ అతిక్ ఖాన్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. నాలుగు మ్యాచ్‌లలో 18 వికెట్లు తీసి బ్యాటింగ్‌లో 88 పరుగులు సాధించాడు.అతడి ప్రతిభను గుర్తించిన టోర్నీ నిర్వాహకులు “మ్యాన్ ఆఫ్ ది సీరిస్” అవార్డుతో సత్కరించి రూ..3,016 నగదు బహుమతి అందజేశారు.ఈ సందర్భంగా అతిక్ మాట్లాడుతూ..నా ప్రదర్శనకు సహకరించిన జట్టు సభ్యులు,గ్రామస్థుల ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులో ఇంకా మెరుగైన స్థాయిలో రాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను అని తెలిపారు.ఈ కార్యక్రమంలో టోర్నీ నిర్వాహకులు సంతోష్,కోటి,నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram