ఛత్తీస్‌గఢ్‌లో భారీగా మావోయిస్టుల లొంగుబాటు

ఛత్తీస్‌గఢ్‌లో భారీగా మావోయిస్టుల లొంగుబాటు – అమిత్‌ షా ప్రకటన

 

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు భారీ స్థాయిలో లొంగిపోయారు. మొత్తం 170 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఎక్స్‌ ప్లాట్‌ఫార్మ్‌లో ప్రకటించారు.

 

👉 గత రెండు రోజుల్లో మొత్తం 258 మంది మావోయిస్టులు భద్రతా బలగాల ముందు లొంగిపోయినట్టు ఆయన తెలిపారు.

👉 “మావోయిస్టులు హింస మార్గం విడిచి జనజీవన స్రవంతిలో కలవాలి,” అని అమిత్‌ షా పిలుపునిచ్చారు.

👉 అయితే, “లొంగిపోకుండా హింసకు పాల్పడే వారిపై తుపాకీతోనే సమాధానం ఇస్తాం,” అని ఆయన స్పష్టం చేశారు.

 

ఈ లొంగుబాటుతో మావోయిస్టు ఉద్యమం బలహీనపడుతోందని, శాంతి స్థాపన దిశగా ఇది కీలక మలుపు అని కేంద్రం పేర్కొంది.

Facebook
WhatsApp
Twitter
Telegram