జాతీయ స్థాయిలో కరకగూడెం మండల యువతికి స్వర్ణం
శ్రీ తేజ తల్లిదండ్రుల శాలువాతో సత్కరించిన జేఏసీ
గోల్డెన్ న్యూస్ / కరకగూడెం హేస్టలాతాన్ అనేది ఒక క్రీడా ఆ క్రీడ విభాగంలో జాతీయ స్థాయిలో విశిష్ట ప్రతిభ కనబరచిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి తోలేం శ్రీ తేజ విజయాన్ని పురస్కరించుకొని, ఆమే తల్లిదండ్రులను ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక (జేఏసీ) కరకగూడెం మండల కమిటీ సత్కరించిది.నిరుపేద కుటుంబానికి చెందిన శ్రీ తేజ జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవడం ఆదివాసీ సమాజానికి గర్వకారణమని జేఏసీ నాయకులు పేర్కొన్నారు. శ్రీ తేజ ప్రతిభ వెనుక తల్లిదండ్రుల త్యాగం, ప్రోత్సాహం ఎంతో కీలకమని వారు అభిప్రాయపడ్డారు. గిరిజన గ్రామాలలో ఇలాంటి ఆదివాసీ ఆణిముత్యాలు ఇంకా ఎంతోమంది పేదరికంలో మగ్గిపోతున్నారు అటువంటి వారిని గుర్తించి ప్రభుత్వం తరఫున ఆర్థికంగా ప్రోత్సహించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో మండల ఆదివాసీ ఉద్యమ నాయకులు పి. వెంకట్ నారాయణ, కలం సాంబమూర్తి, చంద రామకృష్ణ, మలకం నరేష్, ఊకే గణేష్,కంగాల సురేష్ గ్రామ పెద్దలు, యూత్ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.









