గోల్డెన్ న్యూస్ /రంగారెడ్డి : ఏసీబీ అధికారుల వలకు మరో విద్యుత్ అవినీతి అధికారి చిక్కాడు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధి హిమాయత్ సాగర్ సెక్షన్ గంధంగూడ 33/11 కేవీ సబ్ స్టేషన్ అసిస్టెంట్ ఇంజినీర్ అమర్ సింగ్ లంచం తీసుకుంటూ అవినీతి శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. అపార్ట్‌మెంట్ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ కోసం దరఖాస్తు చేసుకోగా ఏఈ లంచం డిమాండ్ చేశాడు. శనివారం బాధితుడి నుంచి రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలవేసి రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. ఏఈపై కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.
Post Views: 28









