కంటి ఆపరేషన్ చేయించుకున్న వారికి మందులు పంపిణీ

గోల్డెన్ న్యూస్/ కరకగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  కరకగూడెం మండలం, కొత్తగూడెం గ్రామంలో ఇటీవల నిర్వహించిన కంటి వైద్య శిబిరంలో కంటి ఆపరేషన్ల కోసం సెలెక్ట్ అయిన వారికి  సికింద్రాబాద్ లోని పుష్పగిరి కంటి ఆసుపత్రి  నందు ఉచితంగా 50 మందికి కంటి ఆపరేషన్లు చేయించడం జరిగింది. కంటి  ఆపరేషన్లు చేయించుకున్న  అందరికీ  మణుగూరు ఏరియా ఆసుపత్రిలో ఉచితంగా మందులు పంపిణీ చేయడం చేశారు. ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్,ఆర్ఎంఓ డాక్టర్ గౌరీ ప్రసాద్,ఆప్తాల్మిక్ ఆఫీసర్ జి. సంజీవరావు కంటి ఆపరేషన్లు చేయించుకున్న వారికి, తీసుకోవలసిన జాగ్రత్తలు పాటించవలసిన నియమాల గురించి సూచించారు, ఆపరేషన్లు చేయించుకున్న వారికి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగినది. కంటి ఆపరేషన్లు చేయించుకున్న వారందరికీ కూడా మంచి చూపు వచ్చిందని ఈ సందర్భంగా ఆప్తాల్మిక్ ఆఫీసర్ జి. సంజీవరావు తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ నుంచి ఆదినారాయణ, ప్రమోదు, ప్రవీణు ఏరియా హాస్పిటల్ వైద్య సిబ్బంది పాల్గొనినారు.

Facebook
WhatsApp
Twitter
Telegram