రూ. 1600 విలువ చేసే చీరలు
ఇందిరా మహిళా శక్తి పేరుతో పంపిణీ
కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని “ఇందిరా మహిళా శక్తి” పేరుతో నిర్వహిస్తోంది. బతుకమ్మ పండుగ సందర్భంగా ఇవ్వాల్సిన ఈ చీరలు, తయారీ ఆలస్యం కారణంగా అప్పుడు పంపిణీ కాలేదు. ఇప్పుడు, ఆ కానుకను మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి రోజు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.
నవంబర్ 15లోపు తయారీ పూర్తి
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చీరల తయారీ తుది దశలో ఉంది. సర్కార్ నిర్ణయం ప్రకారం, నవంబర్ 15 లోపు అన్ని చీరలు తయారవ్వాలి. తర్వాత అవి గోదాములకు తరలించి, జిల్లాల వారీగా పంపిణీ చేయనున్నారు. బతుకమ్మ పండుగలో సాధ్యంకాని పంపిణీని ఈసారి సక్రమంగా చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది..
Post Views: 29









