విస్తృతంగా వాహనాల తనిఖీ

గోల్డెన్ న్యూస్/కరకగూడెం : మండలంలోని వీరాపురం క్రాస్ రోడ్ వద్ద మంగళవారం సాయంత్రం ఎస్‌ఐ పి .వి.ఎన్. రావు   ఆధ్వర్యంలో ముమ్మరంగా వాహనాలు తనిఖీ చేపట్టారు. ద్విచక్ర వాహనాలు, కార్లు , ఆటోలు తనిఖీ చేసి డ్రైవింగ్‌ లైసెన్స్‌, బండి రిజిస్ట్రేషన్ కాగితాలు పరిశీలించారు . ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ .. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా బండి రికార్డులు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, హెల్మెట్‌ కలిగి ఉండాలన్నారు.మావోయిస్టుల బందు పిలుపు నేపథ్యంలో విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహిస్తూ అనుమానస్పద వ్యక్తులను విచారిస్తున్నారు..

Facebook
WhatsApp
Twitter
Telegram