గోల్డెన్ న్యూస్ /కరకగూడెం : మండలంలొ మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పద్మపురానికి గ్రామానికి చెందిన రైతు సాదు అశోక్ సాగు చేసిన 10 ఎకరాల వరి పంట నేలమట్టమయింది. భారీ వర్షం వల్ల పంట పొలాలు జలమయమై, పంటకు తీవ్ర నష్టం కలిగినట్లు తెలుస్తోంది. చేతికొచ్చిన పంట నేల పాలవడంతో రైతు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు . ఇదే కాకుండా మండలంలోని ఇతర గ్రామాల్లో కూడా పంట పొలాలు దెబ్బతిన్నట్లు రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం పరిశీలించి పంట నష్టపోయిన రైతును ఆదుకోవాలని సంబంధిత అధికారులను కోరారు.
Post Views: 147









