చాతకొండ అంగన్‌వాడీ కేంద్రం పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : లక్ష్మీదేవి పల్లి మండలం చాతకొండలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చిన్నారుల హాజరు, పోషకాహార పంపిణీ, ఆరోగ్య పర్యవేక్షణ, విద్యా కార్యక్రమాల అమలు విధానాలను సమీక్షించారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు నిర్వహిస్తున్న రికార్డులను జాగ్రత్తగా పరిశీలించి, పిల్లలకు సమయానికి ఆహారం, పాలు, గుడ్లు అందజేయాలని ఆదేశించారు.

 

ఈ సందర్బంగా కలెక్టర్ అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులతో ముచ్చటించారు.

అదేవిధంగా, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులకు అందించే పోషకాహార పథకాలు సక్రమంగా అమలవుతున్నాయా అనే అంశంపై కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంగన్‌వాడీ భవనం పరిశుభ్రత, పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఆట వస్తువులు, నేర్చుకునే సామగ్రి వాడకం వంటి అంశాలపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.

 

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు పనితీరు ఆదర్శవంతగా ఉన్నాయి అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు, గర్భిణులు, బాలింతలు, ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకునేలా చూడాలని అన్నారు.

 

ఈ సందర్భంగా అంగన్‌వాడీ సిబ్బంది కేంద్రానికి ప్రహరి గోడ ఏర్పాటు చేయవలసిందిగా కలెక్టర్‌ను కోరగా, ఆయన వెంటనే హామీ ఇచ్చి త్వరలోనే గోడ నిర్మాణం చెప్పడతాము తెలిపారు.

 

 

ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట అంగన్వాడి సిబ్బంది మరియు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు..

Facebook
WhatsApp
Twitter
Telegram