పలు ఆదివాసి గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేక గిరిజన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఓ గర్భిణీకి పురిటి నొప్పులు రాగా.. సరైన రోడ్డు వసతి లేక అంబులెన్స్ 1కిలోమీటర్ దూరంలో నిలిచిపోయింది. చివరకు సిబ్బంది మహిళను అంబులెన్స్ వద్దకు మంచంపై మోసుకెళ్లాల్సి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం చిట్యాల గ్రామ శివారు గొత్తికోయాగూడెంలో శుక్రవారం సాయం జ్యోతి అనే గోత్తికోయ మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. సరైన మార్గం లేకపోవడంతో కిలోమీటరు దూరం వద్ద 108 వాహనాన్ని నిలిపి, గర్భిణీ స్త్రీని మంచంపై మోసుకొచ్చి సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. వెంటనే స్పందించిన 108 సిబ్బందికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
Post Views: 25









