బస్సు ప్రమాదంపై వీడిన మిస్టరీ.. అసలు నిజాలు ఇవే

బస్సు ప్రమాదంపై వీడిన మిస్టరీ.. అసలు నిజాలు ఇవే

 

● 19 మంది ప్రాణాలు తీసిన బైకర్ యాక్సిడెంట్

 

● అర్ధరాత్రి 2 గంటల సమయంలో పల్సర్ బైక్‌పై తన స్నేహితుడు ఎర్రిస్వామిని (నాని) కర్నూలు జిల్లాలోని తుగ్గలి గ్రామంలో వదిలేందుకు లక్ష్మీపురం నుంచి బయల్దేరిన శివశంకర్

 

● మార్గమధ్యలో కియా షోరూమ్ దగ్గర ఉన్న HP పెట్రోల్ బంక్‌లో రూ.300 పెట్రోల్ నింపుకున్న ఎర్రిస్వామి, శివశంకర్

 

● కొద్ది దూరం వెళ్లగానే స్కిడ్ అయి డివైడర్‌ను ఢీకొట్టిన బైక్

 

● ప్రమాదంలో శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందగా, స్వల్ప గాయాలతో బయటపడ్డ వెనుక కూర్చున్న ఎర్రిస్వామి

 

● రోడ్డుమధ్యలో ఉన్న శివశంకర్ మృతదేహాన్ని పక్కకు లాగిన ఎర్రిస్వామి

 

● అదే సమయంలో కర్నూలులోని చిన్నటేకూరు దగ్గర వేగంగా వచ్చిన కావేరి ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు రోడ్డు మధ్యలో బైక్‌ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లడంతో చెలరేగిన మంటలు

 

● బస్సులో మంటలు కనిపించడంతో భయపడి తన స్వగ్రామం తుగ్గలికి వెళ్లిపోయిన ఎర్రిస్వామి

 

● సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా ఎర్రిస్వామిని గుర్తించిన పోలీసులు, పలు కోణాల్లో విచారించి ప్రమాదం జరిగిన తీరును వివరించిన పోలీసులు

Facebook
WhatsApp
Twitter
Telegram