👉 సీపీ సజ్జనార్ క్లారిటీ
హైదరాబాద్ చాదర్ ఘాట్‍లో జరిగిన కాల్పుల ఘటనపై సిటీ సీపీ వి.సి సజ్జనార్ స్పందించారు. చాదర్ ఘాట్ విక్టోరియా గ్రౌండ్ సమీపంలో ఇద్దరు దొంగలు సెల్ ఫోన్ దొంగతనం చేస్తూ పారిపోతుండగా వారిని అక్కడే తన సిబ్బందితో ఉన్న సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య పట్టుకునే ప్రయత్నం చేశారన్నారు. ఈ క్రమంలో ఒక దొంగ తన వద్ద ఉన్న కత్తితో కానిస్టేబుల్‍పై దాడికి ప్రయత్నించారని, ఈ క్రమంలోనే ఆత్మరక్షణలో భాగంగా డీసీపీ దొంగలపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారని తెలిపారు. ఈ ఘటనలో డీసీపీతో పాటు మిగతా పోలీసు సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు చెప్పారు.
Post Views: 34









