♦ రోడ్లు మరమ్మత్తులు వెంటనే చేయాలి
♦ రోడ్ల గుంతలపై బీఆర్ఎస్ పార్టీ నిరసన
మాయమాటలతోటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను,అభివృద్ధిని వదిలేసి నిద్రమత్తులో వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు రావుల సోమయ్య పేర్కొన్నారు.
సోమవారం కరకగూడెం మండలంలోని అనంతారంలోని బయ్యారం-తాడ్వాయి ప్రధాన రహదారిపై ఉన్న గుంతలను మరమ్మత్తులు వెంటనే చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…అధికారంలోకి వచ్చి 22 నెలలు గడిచిన సంక్షేమం,అభివృద్ధికి కొండంత దూరంలో వదిలేసి ప్రభుత్వం కాలక్షేపం చేస్తుందని,జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్న పర్యటనలకు మాత్రమే పనికి వస్తారని,ప్రజాభివృద్దికి శూన్యమని సూచించారు.ప్రధాన రహదారిపై ఉన్న గుంతలమయంగా ఏర్పడి ప్రమాదాలకు నిలయంగా మారిందని,రోడ్లు మరమ్మత్తులు చేయకుంటే ప్రాణనష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని ఆకాంక్షించారు.జిల్లా మంత్రులు స్పందించి వెంటనే ప్రజల శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని రోడ్లు గుంతలకు మరమ్మత్తులు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు బుడగం రాము,కొమరం రాంబాబు, అత్తె నాగేశ్వరరావు,రేగా సత్యనారయణ,అత్తె సత్యనారయణ,గుడ్ల రంజిత్,బైరశెట్టి చిరంజీవి,ఊకే రామానాథం,పాయం నర్సింహారావు,గొగ్గల నాగమణి,పసునురి అంజయ్య,నిట్టా ఏడుకొండలు,ఈసం సమ్మయ్య,కోమ్మ ప్రసాద్,సుతారి నాగేష్,బట్టా బిక్షపతి,తాటి వెంగళరావు,యాకుబ్ ఖాన్,ఫాజ్జల్ హుసైన్,రాజేశ్వరరావు,పాయం క్రిష్ణ,అత్తె ముకుందా,ముగిళిపువ్వు వెంకన్న,నిట్టా ప్రభాకర్,సిద్ది సునీల్,కార్యకర్తలు తదితరులు పాల్గోన్నారు.









