తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 14,000 అంగన్వాడీ పోస్టుల నియామకానికి ప్రభుత్వం వేగం పెంచింది. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఈ నియామక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.మంత్రి పేర్కొన్నట్లు, ప్రస్తుతానికి చాలా అంగన్వాడీ కేంద్రాలు సిబ్బంది లేమితో సక్రమంగా పనిచేయలేకపోతున్నాయి. పోషణ, బాలల సంరక్షణ, గర్భిణీ స్త్రీల ఆరోగ్య పథకాలు సమర్థవంతంగా అమలు కావాలంటే సిబ్బంది నియామకం అత్యవసరమని తెలిపారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో STలకు 100% కోటా కొనసాగింపుపై సుప్రీంకోర్టు స్టే ఎత్తివేయడానికి వేకేట్ పిటిషన్ వేయాలని ఆదేశించారు.
అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని తెలిపారు.
ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మినీ అంగన్వాడీ టీచర్ల పోస్టుల భర్తీపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించారు.
Post Views: 28









