దిశ మార్చుకున్న మొంథా తుఫాన్ : తెలంగాణ వైపు పయనిస్తోంది.

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్  : బంగాళాఖాతంలో ఏర్పడి ఆంధ్రా తీరం వైపు దూసుకెళ్తున్న “మెంతా” తుఫాన్ దిశ మార్చుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ తుఫాన్ ఇప్పుడు తెలంగాణ వైపు పయనిస్తోంది.

 

వాతావరణ శాఖ ప్రకటన ప్రకారం తుఫాన్ ప్రస్తుతం భద్రాచలం నుండి సుమారు 50 కిలోమీటర్లు, ఖమ్మం నుండి 110 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

 

తుఫాన్ ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో విస్తృతంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

 

నివాసులు అప్రమత్తంగా ఉండాలి, అవసరమైతే అధికారులు ఇచ్చే సూచనలను తప్పక పాటించాలంటూ హెచ్చరిక జారీ చేశారు. తుఫాన్ వేగం గంటకు 45-55 కిలోమీటర్ల వరకు నమోదవుతుందని అంచనా. తక్కువ ప్రెషర్ ప్రభావంతో కొన్ని చోట్ల గాలులు బలంగా వీచే అవకాశముంది.

Facebook
WhatsApp
Twitter
Telegram