తొక్కిసలాట ఘటనపై విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి

శ్రీకాకుళం జిల్లాలోని తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

 

గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. మరోవైపు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

 

దైవదర్శనానికి వెళ్లిన సమయంలో ఇలా ప్రాణ నష్టం జరగటం బాధాకరమన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram