వైన్ షాప్ వచ్చింది : ఉద్యోగం ఊడింది

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ టీచర్ మద్యం టెండర్లలో పాల్గొనగా ఆమెకు లక్కీ డ్రాలో వైన్స్ షాపు దక్కింది. అయితే ఆ సంతోషం ఎన్నో రోజులు లేదు. విద్యాశాఖ అధికారులకు షాకింగ్ నిర్ణయం తీసుకుని ఆ టీచర్‌కు ఝలక్ ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్ రాంనగర్ బాలికల ఉన్నత పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న పుష్ప పేరుతో ఆమె భర్త ఇటీవల మద్యం టెండర్ వేయగా వారికి ధర్మపూర్ వైన్‌షాప్ లక్కీ డిప్‌లో దక్కింది. ఇందుకు సంబంధించి పుష్ప అధికారుల సమక్షంలో సంతకం చేసి తదనంతర ప్రక్రియను సైతం పూర్తి చేశారు.

అయితే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మద్యం టెండర్లు దక్కించుకోవడానికి అర్హులు కాదని నిబంధనలు ఉండడంతో ఓ వ్యక్తి టెండర్ల ఖరారు రోజునే అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ అంశం మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో అధికారులు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకొని విచారణ జరిపారు. పీఈటీ పుష్ప మద్యం టెండర్ల దాఖలు నుంచి షాపు దక్కేవరకు చేసిన ప్రక్రియలకు సంబంధించి అన్ని ఆధారాలు సేకరించి నివేదించగా పరిశీలించిన జిల్లా విద్యాశాఖ అధికారి ప్రవీణ్‌కుమార్  పీఈటీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram