గోల్డెన్ న్యూస్ / మణుగూరు : మణుగూరు పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేసి దగ్ధం చేసిన సంఘటనా స్థలం వద్దకు ఆదివారం స్పెషల్ పార్టీ బలగాలు చేరుకున్నాయి. డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ పర్యవేక్షణలో 144 సెక్షన్ అమలు చేశారు . ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
పట్టణంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయగా, ముగ్గురికి మించి గుంపుగా కూడినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రవీందర్ రెడ్డి హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు వారు వెల్లడించారు..
Post Views: 68









