కలెక్టర్ చేసిన పనికి ప్రజలు ఫిదా

కరకగూడెం మండలం  వీరాపురం క్రాస్ రోడ్ నుండి బయలుదేరి, రేగళ్ళ – మర్కొడు – ఆళ్లపల్లి మార్గం గుండా కొత్తగూడెం వరకు స్వయంగా ప్రయాణం చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్.

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం :కరకగూడె: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పూర్తిగా ఏజెన్సీ  ప్రాంతం కరకగూడెం, ఆళ్లపల్లి మండలాలు  ఇలాంటి ప్రదేశానికి కలెక్టర్ స్థాయి అధికారులు వెళ్లాలంటే పోలీస్ బందోబస్తు లేకుండా వెళ్లలేరు. అటువంటి తరుణంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఎటు వంటి బందోబస్తూ లేకుండా గంటల తరబడి కారడవిలో ప్రయాణం సాగించిన సంఘటన అధికారులకు. ఆ ప్రాంత ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగించింది.   కరకగూడెం మండలంలోని వీరాపురం క్రాస్ రోడ్డు నుంచి రేగళ్ళ మీదుగా జిన్నలగూడెం, మర్కొడు, ఆళ్ల పల్లి వరకు  రహదారి ఉన్నప్పటికీ  ఈ రహదారి సుమారు 10  మీటర్ల అసంపూర్తిగానే ఉంది ఈ ప్రాంతంలో కిన్నెర సాని అభరణ్యం ఉండటంతో  అటవీ శాఖ అధికారులు రహదారికి అనుమతులు ఇవ్వలేదు.  దీంతో రెండు మండలాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రహదారి సౌకర్యం లేకపోవడంతో ఈ రహరి నుంచి వాహనాలకు  రాకపోకలు లేవు. అయితే, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో కలెక్టర్ స్వయంగా ఈ కష్టమైన మార్గాన్ని ఎంచుకున్నారు. కలెక్టర్ సాహస పేత నిర్ణయానికి ప్రజలు అభినందిస్తున్నారు..

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram