గోల్డెన్ న్యూస్ /కరకగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ (ట్రైనీ ఐఏఎస్) సౌరబ్ శర్మ మంగళవారం ఆళ్లపల్లి , కరకగూడెం మండలాలలోని కిన్నెరసాని అభయారణ్యంలో రేగళ్ల రేంజర్ జశ్వంత్ ప్రసాద్ తో కలిసి పర్యటించి అటాచ్మెంట్ కార్య క్రమాన్ని పూర్తి చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ఆయన అటవీ శాఖ కార్యకలాపాలు, సంపద, స్థానిక అభివృద్ధి పరిపాలనపై అవగాహన అటవీ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.ర అనంతరం కరకగూడెం మండలం రేగళ్ళ రేంజ్ రంగాపురం బేస్ క్యాంపును అసిస్టెంట్ కలెక్టర్ పరిశీలించారు.. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ప్లాంటేషన్, అటవీ జంతువులకు తాగునీరు, సీసీ కెమెరాలు వంటివి పరిశీంచిన ఆయన అటవీ శాఖ అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ , సెక్షన్ ఆఫీసర్ చిలకమర్రి శ్రీను, బీట్ ఆఫీసర్లు సుమన్, నాగేంద్రబాబు, గౌతమ్ నాయక్.. పాల్గొన్నారు
Post Views: 75









