గోల్డెన్ న్యూస్ / కామారెడ్డి : నేనే మీ కలెక్టర్ ను అని కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఓ మహిళ హల్‌చల్ చేసింది. ఐఏఎస్ సర్టిఫికెట్లతో కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన మహిళ.. తనకు కామారెడ్డి కలెక్టర్‌గా ఉద్యోగం వచ్చిందని, తన ఛాంబర్ ఎక్కడ అంటూ కలెక్టర్ కార్యాలయంలో హడావిడి చేసింది. నకిలీ ఐఏఎస్ సర్టిఫికెట్లతో కలెక్టర్ కార్యాలయంలో హల్ చల్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో మహిళపై డిఆర్ఓ మధుసూదన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యులతో కారులో బుధవారం మధ్యాహ్నం సమయంలో కలెక్టర్ కార్యాలయానికి వచ్చినట్లు తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా తూప్రాన్ వద్ద సదురు మహిళను గుర్తించారు. అదనపు కలెక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Post Views: 28









