వలస ఆదివాసీ కుటుంబాలకు సోలార్ లాంప్స్ పంపిణి

ఆధార్ సంస్థ ఆధ్వర్యంలో వలస ఆదివాసీ 50 కుటుంబాలకు సోలార్ లాంప్స్ పంపిణి

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం :  భద్రాద్రికొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలం పద్మాపురం గ్రామ పంచాయతీ  అటవీ ప్రాంతంలో నివాసం ఉంటున్న నీలాద్రిపేట గ్రామంలో 50 వలస ఆదివాసి కుటుంబాలకు, ఆధార్ సంస్థ వ్యవస్థాపకుడు తోలెం రమేష్ 50 సోలార్ లాంప్స్ గురువారం  పంపిణి చేశారు.  ఈ సందర్బంగా తోలం రమేష్  మాట్లాడుతూ.. గ్రామంలో విద్యుత్ సౌకర్యం లేదు. వర్షాలు పడుతున్న ఈ కాలంలో, రాత్రి సమయంలో ఇంటిలో వెలుతురు లేక పిల్లలు, వృద్ధులు, మహిళలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గ్రామంలో విద్యార్థులు చదువుకోలేక, పెద్దలు రాత్రి పనులు చేసుకోలేక, భయంతో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ సమస్యను గుర్తించి సోలార్ లాంప్స్ 50 కుటుంబాలకు అందజేసినట్లు తెలిపారు.  సోలాార్లాంప్స్ తో రాత్రి సమయంలో వెలుగు, భద్రత, కలుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో రామన్ శక్తి ఫౌండేషన్ ప్రతినిధులు నవ్యోదయ, హేమ, దినేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, రామ స్వామి, అంగన్వాడీ టీచర్, స్వర్ణలత, ఆధార్ సంస్థ వాలంటీర్ ఈ సం రాజబాబు, గ్రామ పెద్దలు,మాడరామ్, పిరోజ్ కుమార్, దేవయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram