భద్రాద్రి జిల్లా యువతకు మరో శుభవార్త

జిల్లా యువతకు మరో శుభవార్త

హైదరాబాద్‌తో పాటు రాజమండ్రిలో కూడా ఫర్నిచర్ శిక్షణ అవకాశం – జిల్లా కలెక్టర్

శనివారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌లో ఒరియంటేషన్ & ఎంపిక పరీక్ష

గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం :  కొత్తగూడెం కలెక్టరేట్‌లో NSTI, FFSC మరియు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఒరియంటేషన్, డ్రాయింగ్, ఆప్టిట్యూడ్, ప్రాక్టికల్ మరియు ఇంటర్వ్యూ పరీక్షలలో 19 మంది అభ్యర్థులు మల్టీపర్పస్ అసిస్టెంట్ ఫర్ ఫర్నిచర్ ప్రొడక్షన్ అండ్ ఇన్స్టాలేషన్ శిక్షణకు హైదరాబాద్ NSTI–FFSC లో ఎంపికయ్యారు.

 

ఎంపికైన అభ్యర్థుల కోసం ఒక్కొక్కరికి రూ. 5,000 రిజిస్ట్రేషన్ ఫీజును జిల్లా యంత్రాంగం భరిస్తుంది, అలాగే శిక్షణ కాలమంతా ఉచిత వసతి మరియు భోజనం కల్పించబడతాయని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఐఏఎస్ గారు తెలిపారు.

 

*రాజమండ్రిలో శిక్షణకు 11 సీట్లు – శనివారం ఎంపిక*

 

అదనంగా, రాజమండ్రిలో ఫర్నిచర్ అసిస్టెంట్ రెసిడెన్షియల్ శిక్షణ కోసం 11 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

ఈ అవకాశాన్ని జిల్లా యువత తప్పకుండా వినియోగించుకోవాలని సూచించారు.

 

దీనికి సంబంధించి శనివారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌లో రూమ్ నెంబర్ ఎస్-20 లో ఒరియంటేషన్ మరియు ఎంపిక పరీక్ష నిర్వహించబడుతుంది.

ఆసక్తి గల అభ్యర్థులు తప్పక హాజరుకావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

Facebook
WhatsApp
Twitter
Telegram