మళ్లీ తుపాకీ పట్టిన సీపీ సజ్జనార్..థ్రిల్లింగ్‌గా ఉంటుందంటూ ట్వీట్
గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా పేరొందిన ఐఏఎస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్ మళ్లీ తుపాకీ పట్టారు. గురువారం ఉదయం హైదరాబాద్ శివార్లలోని తెలంగాణ పోలీసు అకాడమీకి సీపీ సజ్జనార్ వెళ్లారు._*
హైదరాబాద్ సిటీ పోలీసు బృందంతో కలిసి ఆయన పిస్టల్‌తో షూటింగ్ ప్రాక్టీస్ చేశారు. షూటింగ్ రేంజ్‌కు వెళ్లడం, లక్ష్యం గురి తప్పకుండా కొట్టడం ఎప్పుడూ గొప్ప అనుభూతిని ఇస్తుందని, బుల్స్ ఐకి గురిపెట్టి కొట్టడం థ్రిల్లింగ్‌గా కూడా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సీపీ సజ్జనార్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు.
Post Views: 35









