అమరవీరుల ఆశయ సాధనకై పోరాడుదాం!
సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంద) మణుగూరు డివిజన్ కార్యదర్శి ఆర్. మధుసూదన్ రెడ్డి.
గోల్డ్ న్యూస్ /మణుగూరు : అమరవీరుల ఆశయ సాధనకై పోరాడుదాం అని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపందా) మణుగూరు డివిజన్ కార్యదర్శి ఆర్ మధుసూదన్ రెడ్డి అన్నారు. నవంబర్ 1 నుండి 9 వరకు జరుగుతున్న అమరవీరుల సంస్మరణ సభల వారోత్సవాల్లో భాగంగా మణుగూరు లోని స్థానిక పార్టీ కార్యాలయంలో బత్తుల. వెంకటేశ్వర్లు అధ్యక్షతన అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ దేశంలో దోపిడీ, పీడనలు లేని సమ సమాజం కావాలని, ధనిక, పేద బేధం లేకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కలలు కని అందుకోసం తమ జీవితాలను త్యాగం చేసి ఎంతోమంది అమరవీరులయ్యారని అన్నారు. అమరులు ఏ ఆశయం కోసం అయితే పోరాడి అమరులయ్యారో ఆ ఆశయ సాధన కోసం మనమంతా పోరాడాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు కాంపాటి పృథ్వీ, నాయకులు సంజీవరెడ్డి, జానయ్య, మిట్టపల్లి రాజేందర్ మల్లెల. రామయ్య జే. యాకయ్య, సతీష్, నరసింహారావు, రాజు, శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు









