యువత భవిష్యత్తును కాపాడుకోవాలి: డీఎస్పీ

సారపాకలో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు.

గోల్డెన్ న్యూస్/బూర్గంపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో శుక్రవారం పోలీసులు  పాల్వంచ డీఎస్పీ సతీశ్ కుమార్ నేతృత్వంలో పోలీసులు  5 బృందాలుగా స్థానిక గాంధీనగర్ కాలనీలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు అనుమానితుల వివరాలపై ఆరా తీశారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 42 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నా రు .ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎవరైనా కొత్త వ్యక్తులు, లేదా అనుమానితులు తారసపడితే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఈ తనిఖీల్లో  ఎస్సైలు మేడ ప్రసాద్, నాగభిక్షం, దేవీసింగ్, సురేశ్, మధుప్రసాద్, కల్యాణి, సిబ్బంది పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram