గోల్డెన్ న్యూస్ / ఎన్టీఆర్ జిల్లా : జగ్గయ్యపేట మండలం తక్కెల్లపాడు గ్రామంలో ఒక వింత ఘటన అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా మిరప చెట్టుకి మిరపకాయలు మాత్రమే కాస్తాయి.
కానీ ఇక్కడ మాత్రం ఒక రైతు తోటలో మిరప చెట్టుకే వంకాయలు, టమాటాలు కాసిన ఘటన వెలుగుచూసింది. గ్రామంలోని ఓ రైతు మిరప తోటలో ఈ వింత చెట్లు కనిపించాయి. తోట మొత్తం మీద రెండు చెట్లకే ఈ విచిత్రమైన లక్షణం కనిపించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మిరప చెట్టుకి వంకాయ, టమాటాలు కాయడం చూసి అందరూ నివ్వెరపోతున్నారు.
Post Views: 131








