బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న ముగ్గురు యువకులుమందలించిన పోలీసులపై మద్యం మత్తులో దాడి చేయగా దాడిలో పోలీసులకు గాయాలు
గోల్డెన్ న్యూస్ /నల్లగొండ : గస్తీ నిర్వహిస్తున్న పోలీసుల పైమంగళవారం రాత్రి ఆకతాయిలు దాడి చేసిన సంఘటన చండూరు మున్సిపల్ కేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాత్రి గస్తీ నిర్వహిస్తున్న ఇద్దరు పోలీస్ సిబ్బందికి స్థానిక భవాణి ఫంక్షన్ హల్ సమీపంలో బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న ముగ్గురు యువకులు కనిపించారు. పోలీసులు వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించగా మద్యం మత్తులో వున్న యువకులు దురుసుగా ప్రవర్తించి పోలీస్ వారి పై దాడికి పాల్పడగా ఒకరికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తుంది. కాగా దాడికి పాల్పడిన యువకులు ప్రస్తుతం పోలీసుల అదుపులో వున్నారు.
Post Views: 25








