గోల్డెన్ న్యూస్ / పినపాక : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడుళ్ల బయ్యారం జాతీయ పాఠశాలలో నవంబర్ 8, న జరిగిన రాష్ట్రస్థాయి అండర్-17 కబడ్డీ పోటీలను ఏడుల్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కంది సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ పోటీల్లో బాలికల విభాగంలో తొలి మ్యాచ్‌లో ఖమ్మం జట్టు హైదరాబాద్ పై విజయాన్ని సాధించగా, బాలుర విభాగంలో వరంగల్ జట్టు నల్గొండపై విజేతగా నిలిచింది.మొత్తం 10 జిల్లాల నుండి సుమారు 300 మంది క్రీడాకారులు, 100 మంది కోచ్‌లు మరియు రిఫరీలు ఈ పోటీలో పాల్గొగొనున్నారు. ప్రో కబడ్డీ మాదిరిగా పగలు మరియు రాత్రి ఫ్లడ్‌లైట్ కాంతిలో క్రీీీీడలు నిర్వహిస్తార. క్రీడాకారులకు కంది చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భోజనం, వసతి సదుపాయాలు కల్పించనున్నట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచన క్రీడాకారులు త్వరలో జాతీయ స్థాయి పోటీలకు తెలంగాణ రాష్ట్రం తరఫున ఎంపిక చేస్తారు .ఈ గెలుపు, ఖమ్మం జట్టుకు మోటివేషన్ గా నిలిచింది మరియు కబడ్డీీ పోటీలకు పినపాక వేదిక కావడం చాలా సంతోషంగా ఉందని క్రీడాకారుడు అభిప్రాయం వ్యక్తంతం చేస్తున్నారు. 








