గోల్డెన్ న్యూస్ / విశాఖపట్నం: అత్త మీద కోపంతో దారుణానికి పాల్పడిందో ఓ కోడలు. కాళ్లు, చేతులు కట్టేసి, కళ్లకు గంతలు కట్టి, ఆమెకు నిప్పు పెట్టింది. ఈ అమానవీయ ఘటన విశాఖ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది..
వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నం జిల్లా జీవీఎంసీలోని 98వ వార్డు అప్పన్నపాలెంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అప్పన్నపాలెంలోని వర్షిణి అపార్టమెంట్లో జయంతి కనకమహాలక్ష్మి (66).. కుమారుడు సుబ్రహ్మణ్య శర్మ, కోడలు లలిత, వారి పిల్లలతో నివాసం ఉంటున్నారు. శుక్రవారం ఉదయం సుబ్రహ్మణ్య శర్మ బయటకు వెళ్లారు. అదే సమయంలో వారి ఇంట్లో నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో కనకమహాలక్ష్మి సజీవ దహనమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. టీవీ వద్ద షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగినట్లు కోడలు లలిత పోలీసులకు తెలిపింది. కనకమహాలక్ష్మి మృతదేహం కాలిపోయిన తీరుపై పోలీసులు ఇల్లంతా పరిశీలించి ఎక్కడా విద్యుదాఘాతం కాలేదని ప్రాథమికంగా నిర్ధరించారు. దీంతో లలితను పలు కోణాల్లో ప్రశ్నించగా.. చివరకు తానే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల ఎదుట అంగీకరించింది.








