గోల్డెన్ న్యూస్ / వికారాబాద్ : మోమిన్ పేట్ లో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వాహీద్ అనే ఆటో డ్రైవర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. పోలీసుల దర్యాప్తులో నిందితుడు సైకోలా మారి, ఇప్పటికే పది మంది అమ్మాయిలపై అత్యాచారం చేసి, ఆ చర్యలను తన సెల్ ఫోన్లో వీడియోలు తీసినట్లు తెలిసింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మోమిన్ పేట్ పోలీసులువాహీద్ను అదుపులోకి తీసుకున్నారు. పోక్సో (POCSO) వంటి కఠిన చట్టాలు ఉన్నా ఇలాంటి నేరాలు జరగడం మహిళా భద్రత పై ప్రశ్నలు రేకెత్తిస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలోని మోమిన్ పేట్ ప్రాంతంలో ఒక మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటన స్థానికంగా దారుణమైన ఉద్రిక్తతను సృష్టించింది. ఒక ఆటో డ్రైవర్ తన పైశాచిక చర్యలతో సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేశాడు. కఠిన చట్టాలు, రక్షణ వ్యవస్థలు ఎన్ని ఉన్నా.. ఇలాంటి నేరప్రవృత్తి గల వ్యక్తుల కారణంగా మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. మోమిన్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఆ మైనర్ బాలికపై వాహీద్ అనే ఆటో డ్రైవర్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. అతని చర్యలు ఒక సైకో వలె ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆటో డ్రైవర్ వహీద్ ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు జరిపిన ప్రాథమిక దర్యాప్తులో భయంకరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. నిందితుడు వహీద్ గతంలో కూడా సుమారు పది మంది అమ్మాయిలపై అత్యాచారాలు చేసి.. ఆ దారుణాలన్నింటినీ తన సెల్ ఫోన్లో వీడియోలు చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. ఇది అతనిలోని నేర ప్రవృత్తి, వికృతానందాన్ని తెలియజేస్తోంది.మైనర్ బాలికలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు ఉన్న పోక్సో చట్టాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు, మహిళా సంఘాలు కోరుతున్నాయి.








